1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

ఏప్రిల్‌లో తెరపైకి వస్తోన్న "అ..ఆ..ఇ..ఈ"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు ఏప్రిల్ తెర అఆఇఈ శ్రీకాంత్ సదా మీరాజాస్మిన్ శ్రీనివాసరెడ్డి శ్రీ కల్పనా ఆర్ట్స్
WD
శ్రీకాంత్, సదా, మీరాజాస్మిన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "అ..ఆ..ఇ..ఈ" (అతను ఆమె ఇంతలో ఈమె).

ప్రస్తుతం టాకీ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఎ. శేఖర్ వెల్లడించారు.

శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, శ్రీ కల్పనా ఆర్ట్స్ పతాకంపై, బి. అశోక్ యాదవ్ నిర్మిస్తున్నారు. హంపిలోని అద్భుతమైన లొకేషన్‌లో ఓ పాటను చిత్రీకరించామని, దీంతో ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని శేఖర్ తెలిపారు.

త్వరలో ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, శ్రీకాంత్, మీరా, సదా కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రం తప్పకుండా విజయవంతమవుతుందని శేఖర్ ఆశించారు.