1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

27న వస్తోన్న "పోలీస్ పోలీస్"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు శ్రీరామ్ పృథ్వీరాజ్ కమలినీ ముఖర్జీ సంజన పోలీస్ పోలీస్ మన్మోహన్ చందు
WD
శ్రీరామ్, పృథ్వీరాజ్, కమలినీ ముఖర్జీ, సంజన హీరోహీరోయిన్లుగా పినాకెల్ పిక్చర్స్‌ పతాకంపై ఈ నెల 27న తెరకెక్కనున్న సినిమా "పోలీస్ పోలీస్". మన్మోహన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని, మోహన్ పాటిల్ సమర్పిస్తున్నారు. చందు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన డీటీఎస్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇద్దరు పోలీసు అధికారుల నిజ జీవిత కథను ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను మలిచినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇప్పటికే టాలీవుడ్‌లో పోలీసు అధికారుల జీవిత కథలను ఆధారంగా జగపతిబాబు హీరోగా, జె.డి. దర్శకత్వంలో "సిద్ధం" సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో... యువ హీరోలు పృథ్వీ, శ్రీరామ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న "పోలీస్ పోలీస్" మాస్‌ను ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. త్వరలో ఈ సినిమా ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లు దర్శకుడు మన్మోహన్ వెల్లడించారు.