ఉగాది కానుకగా శ్రీహరి "సామ్రాజ్యం"
|
ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కొత్త తరహా కథ ఇదని, ఫ్యాక్షన్ లీడర్‌గా నటిస్తున్నానని ఆయన చెప్పారు. పగకాదు సీమలో ప్రేమకూడా ఉండాలన్నదే కథాంశమని, గొడవలు వద్దని దూరంగా వెళ్ళిన అన్నయ్య చివరికి ఎలా కత్తి పట్టాడు? పరిస్థితులు ఏమిటి? కత్తిపట్టిన తాను చివరికి కత్తిని ఎలా వదిలాను? అన్నవే చిత్రంలోని ప్రధానాంశాలను శ్రీహరి తెలిపారు.
సుమన్ అద్భుతంగా నటించాడని, ఇందులో సీమలో ఆడవాళ్ళు కూడా పగపడితే ఎలా ఉంటుందో? ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనేది సందేశాత్మకంగా తెరకెక్కించారని శ్రీహరి వెల్లడించారు.
నిర్మాత ముత్యాల ఆంజనేయులు మాట్లాడుతూ.. విక్రమాదిత్య హీరోగా నిషా కొఠార్, సమీక్ష, మాళవిక హీరోయిన్లుగా నటించారన్నారు. ఈ చిత్రానికి సంగీతం.. చక్రి, ఫైట్స్.. రామ్‌లక్ష్మణ్, విజయ్.
