1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

బ్యాంకాక్ వెళుతున్న అధినేత

ప్రైమ్స్టార్ జగపతిబాబు డైరెక్టర్ వి సముద్ర శ్రద్ధాదాస్ హంసనందిని
WD
ప్రైమ్‌స్టార్ జగపతిబాబు హీరోగా మాస్ డైరెక్టర్ వి. సముద్ర దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి సమర్పణలో కె.కె రాధామోహన్ నిర్మిస్తున్న రాజకీయ సంచలన చిత్రం అధినేత.

ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే క్లైమాక్స్ సన్నివేశాలను ఖమ్మంలో 20వేల మందికి పైగా జనం మధ్య హెలికాప్టర్స్, వందలాది ఆటోలు, చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొనగా భారీ ఎత్తున చిత్రీకరించారు. ఈ నెల 24 వరకూ జరిగిన షెడ్యూల్‌తో రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది.

ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి నిర్మాత మాట్లాడుతూ, మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకూ బ్యాంకాక్, పట్టాయ, పుకెట్ దీవులలో బ్యాలెన్స్ పాటలను చిత్రీకరించడంతో చిత్రం పూర్తవుతుందన్నారు. ఏప్రిల్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ... "జగపతిబాబు చేస్తున్న పవర్‌ఫుల్ పొలిటికల్ ఫిలిమ్ ఇది. భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అవుతుంద"న్నారు. ఈ చిత్రంలో జగపతి బాబుతోపాటు శ్రద్ధాదాస్, హంసనందిని, నీలిమ, ఆహుతి ప్రసాద్, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: శ్రీకాంత్ దేవా, కెమేరా: ప్రసాద్ బాబు
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి