ఏప్రిల్‌లో తెరపైకి వస్తోన్న "లైఫ్స్టైల్"
|
ఘనంగా జరుగనున్న ఆడియో విడుదల కార్యక్రమంలో డా. డి. రామానాయుడు, దిల్‌రాజు, సి. కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. శ్రీజ ఎన్‌సి అనే మహిళ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా పరిచయమవుతుండగా, నిశ్చల్, కార్తీక్, అభిరామ్‌లు హీరోలుగా, మీనాక్షి దీక్షిత్, మోనాలి చౌదరి, అనన్య హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.
ఈ నెల 18 నుంచి 21వరకు చిత్రంలోని ప్రధాన తారాగణంపై, డాన్స్ మాస్టర్ విద్య నేతృత్వంలో చిత్రీకరించిన చివరి పాటతో చిత్రం షూటింగ్ పూర్తయిందని, బ్యాంకాక్, పట్టాయా, వైజాగ్, బాపట్ల మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరిపామని చిత్ర దర్శకులు ముప్పలనేని శివ తెలిపారు.
ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియోను ఈ నెల 29న విడుదల చేసి, ఏప్రిల్ నెలాఖరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర నిర్మాత శ్రీ మాధవ్ పట్నాయక్ చెప్పారు. బ్రహ్మానందం, గిరిబాబు, సన, శివపార్వతి ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
