నాది గెస్ట్ రోల్.. ''బిల్లా''కు నో ప్రాబ్లం: ప్రరాపా కృష్ణంరాజు
|
సినీనటులైన చిరంజీవి, బాలకృష్ణలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో వారు నటించిన చిత్రాలను ప్రదర్శించకుండా చూడాలని ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరిన నేపథ్యంలో... మీరు నటించిన బిల్లా చిత్రం విడుదలకు సమస్య తలెత్తవచ్చా అని కృష్ణంరాజును విలేకరులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ప్రశ్నకు ప్రరాపా నేత కృష్ణంరాజు స్పందిస్తూ, తనది గెస్ట్ రోల్ మాత్రమే కనుక చిత్రం విడుదలకు ఎటువంటి ఆటంకం కలుగబోదని చెప్పినట్లు సమచారం.
ఇక బిల్లా చిత్రం విషయానికి వస్తే... నాటి హిందీ చిత్రం "డాన్" తరహాలో ఉంటుందని సమచారం. ఈ చిత్రం కోసం ప్రభాస్ కష్టపడి ఎయిట్ ప్యాక్ సాధించాడు. సెక్సీ హీరోయిన్ అనుష్క ఈ చిత్రంలో చాలా అందంగా కన్పిస్తుంది. నమిత పాత్ర వైవిధ్యంగా ఉంటుంది.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జయసుధ, అలీ, రహమాన్, కెల్లీథోర్జ్, ఆదిత్య, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎటిటింగ్- మార్తాండ్ కె. వెంకటేష్, సమర్పణ- డా. కృష్ణంరాజు, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం- మెహర్ రమేష్.
