Vishal Pista release on May 14th | మే 14న వస్తోన్న విశాల్ "పిస్తా"
|
ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అలీ మాట్లాడుతూ.. హీరో స్నేహితునిగా నటిస్తున్నానని, విలేజ్‌నుంచి సిటీకి వచ్చిన యువకుడి కథ ఇదని తెలిపాడు.
విశాల్ మాట్లాడుతూ.. "సెల్యూట్" తర్వాత తెలుగులో నేరుగా చేస్తున్న చిత్రమిదని, భూపతి పాండ్యన్ దగ్గర పనిచేసిన అయ్యప్ప ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. తొలిసారిగా ప్రకాష్‌రాజ్‌తో నటిస్తున్నానని, మణిశర్మ సంగీతం సినిమాకు హైలైట్‌గా ఉంటుందన్నారు. వినడానికి కథ పాతదైనా, స్క్రీన్‌ప్లేలో కొత్తదనం ఆకట్టుకుంటుదన్నారు. ఇంకా ఈ సినిమాలో కమెడియన్స్ చాలా మంది ఉన్నారని విశాల్ వెల్లడించారు.
శ్రియ మాట్లాడుతూ.. చక్కని ప్రేమకథతో కూడిన ఈ సినిమాలో యాక్షన్ ఉన్నా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని తెలిపారు.
ఇంకా ఈ చిత్రంలో భరణి, ధర్మవరపు, ఎం.ఎస్. నారాయణ, అన్నపూర్ణ, తెలంగాణ శకుంతల తదితరులు నటిస్తున్నారు. మాటలు.. శశాంక్, కెమేరా.. ప్రియన్, దర్శకత్వం.. సభా అయ్యప్ప.
