1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. విడుదలకు సిద్ధమైన "ఈ వయసులో"

విడుదలకు సిద్ధమైన "ఈ వయసులో"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు విడుదల సిద్ధం ఈ వయసులో సన్నీ యామినీ పసుపులేటి సునీల్ కుమార్
WD
సన్నీ, యామినీ జంటగా పసుపులేటి సునీల్ కుమార్ నిర్మిస్తోన్న "ఈ వయసులో" చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ వారంలోనే తొలికాపీ సిద్ధమవుతోందని, సెన్సార్ పూర్తయిన తర్వాత చిత్రాన్ని ఈ నెలాఖరుకు విడుదల చేస్తామని నిర్మాత అన్నారు. సంగీత దర్శకుడు శంభుప్రసాద్ సమకూర్చిన బాణీలు ప్రజాదరణ పొందాయన్నారు.

చక్కటి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా దర్శకుడు రమేష్ రాయలు తెరకెక్కించారని నిర్మాత వెల్లడించారు. చదువుకునే వయస్సులో ప్రేమలో పడకూడదని, జీవితం పట్ల ఒక బాధ్యత అవసరమని చెప్పే కథాంశమిదని నిర్మాత వివరించారు. అలాగే తల్లిదండ్రులకు పిల్లలపట్ల నమ్మకం అవసరమని చెబుతూ అంతర్లీనంగా సందేశాన్ని చూపించామని ఆయన చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ.. సరికొత్త పాయింట్‌తో తయారైన ప్రేమకథా చిత్రమిదని, క్వాలిటీపరంగా భారీ చిత్రంగా మలిచామన్నారు. ఇంకా ఈ చిత్రానికి కథ.. సాయిచంద్ర, కెమేరా.. ఎస్.వి.శివరామ్, ఎడిటింగ్.. కోలాభాస్కర్, పాటలు.. వనమాలి.