1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. 24న తెరపైకి వస్తోన్న "సర్కస్ సర్కస్"

Circus circus release on 24th April | 24న తెరపైకి వస్తోన్న "సర్కస్ సర్కస్"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు 24 తెర సర్కస్ సర్కస్ చిట్టిబాబు లహరి ఉమేష్ కుమార్
సగిటేరియస్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన చిత్రం "సర్కస్‌ సర్కస్". చిట్టిబాబు, లహరి తల్లిదండ్రులుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీధర్, చాందిని, అజయ్, ఉషశ్రీ, మానిష్ బాలనటులుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీన సురేష్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు ఉమేష్ కుమార్ వెల్లడించారు.

ఈ సినిమా పాటలను ఇటీవలే రామానాయుడు స్టూడియోలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. తెలుగులో బాలలపై మంచి చిత్రాన్ని తీయాలనే సంకల్పంతో తాను "సర్కస్ సర్కస్" అనే చిత్రాన్ని రూపొందించానన్నారు.

ఈ చిత్రంలోని బాలనటీనటులు చేసే కృత్యాలు పెద్దలను అలరిస్తాయని, పిల్లలకు 50శాతం తగ్గింపు ధరతో ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. సర్కస్‌లో జరిగే విశేషాలతో పాటు అందులో సస్పెన్స్ గొలిపే కథాంశంతో ఈ సినిమాను రూపొందించామని ఆయన వివరించారు.

ఇంకా ఈ చిత్రానికి కెమేరా.. శరత్, సంగీతం.. శ్యామ్, దాస్, ఎడిటర్.. మంజు, మాటలు.. మనోజ్ బన్సాల్, ఉమేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఎస్. ఉమేష్‌కుమార్.