1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. వంశీమార్క్‌ లవ్‌స్టోరీగా "గోపి-గోపిక-గోదావరి"

Vamsi mark love Story Gopi-Gopika-Godhavari Comes on May | వంశీమార్క్‌ లవ్‌స్టోరీగా "గోపి-గోపిక-గోదావరి"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు మే ప్రేక్షకులు వేణు కమలిని ముఖర్జీ వంశీ మార్క్ ప్రేమకథ దర్శకత్వం ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు
WD
వేణు, కమలిని ముఖర్జీ హీరోహీరోయిన్లుగా వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "గోపి-గోపిక-గోదావరి". మహర్షి సినిమా పతాకంపై వల్లూరిపల్లి రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఇదే పతాకంపై వచ్చిన "ఔను వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు" తరహాలోనే వంశీమార్క్ ప్రేమకథా చిత్రమిదని నిర్మాత తెలిపారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయి, డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున ఆడియోను, మేలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు. పోలవరం, గోదావరి, పాపికొండలు, సింగన్నపల్లి రేవు తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయన్నారు. సింగన్నపల్లి రేవులో వేసిన భారీ సెట్‌లో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించారని రమేష్ వివరించారు.

కృష్ణభగవాన్, కొండవలస, జీవా, కళ్యాణ్, జయలలిత, గీతాంజలి, సన, పిళ్ళా ప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా.. బి. లోకేశ్వరరావు, సంగీతం.. చక్రి, నిర్మాత.. వల్లూరు పల్లి రమేష్.