"Chalo 123" Ready for Release | విడుదలకు సిద్ధమైన "చలో వన్ టూ త్రీ"
|
ఈ సందర్భంగా నిర్మాత అల్లాడి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఈ సినిమా తొలికాపీ సిద్ధమైందన్నారు. పేరుకు తగిన విధంగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు, ఒక హీరోయిన్ ఉంటుందన్నారు. ఇది త్రిక్రోణ ప్రేమకథని, ప్రస్తుతం నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయని చెప్పారు. సెన్సార్ పూర్తిచేసి త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.
దర్శకుడు పల్లా మాట్లాడుతూ.. ప్రేమ, కామెడీ, సస్పెన్స్‌తో ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా ఉంటుందని, పూర్తి వినోదాత్మకంగా ప్రేక్షకులను నవ్విస్తుందన్నారు. ఈ సినిమా ఆడియో త్వరలో విడుదల కానుందని దర్శకుడు తెలిపారు.
