ప్రజల్లో చైతన్యం కలిగించే "దుర్గి"
|
ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న "దుర్గి" చిత్రాన్ని మే 1న విడుదల చేయనున్నారు.
ఓ అటవీ ప్రాంతంలోని గూడెంలో ఉన్న మూఢాచారం వల్ల 60 ఏళ్ళ వృద్ధుడితో జీవితాంతం గడపాల్సిన పరిస్థితి ఏర్పడడంతో అది సహించలేక ఒక 13 ఏళ్ళ బాలిక ఏవిధంగా మూఢాచారాన్ని ప్రతిఘటించి తనను తాను రక్షించుకుంటుందన్నదే ఈ చిత్ర కథాంశమని దర్శకుడు వెల్లడించారు.
ఈ చిత్రాన్ని అరకు, బోడరేవు, పాడేరు, సలుగు తదితర గిరిజనవాడలో చిత్రించామని దర్శకుడు చెప్పారు. జ్యోత్స టైటిల్ పాత్ర పోషించగా, కొండవలస, నీలిమానాయుడు, విజయానంద్, ఆలపాటి లక్ష్మిణ, కళ్యాణి తదితరులు ఈ సినిమాలో నటించారు. ఇంకా ఈ చిత్రానికి మాటలు... సి.హెచ్. రామకృష్ణ, సంగీతం.. ఖుద్దూస్, కెమేరా.. సూర్య.

