1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. మే రెండో వారంలో రానున్న "ముద్దుగుమ్మ"

Mudhugumma Release on May Second Week | మే రెండో వారంలో రానున్న "ముద్దుగుమ్మ"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు మే రెండో వారం ముద్దుగుమ్మ శిల్పాశెట్టి దీపక్తిజోరి ఖామోష్ సెన్సార్ ఎ సర్టిఫికేట్
ముంబై ముద్దుగుమ్మ శిల్పాశెట్టి కథానాయికగా, హిందీలో దీపక్‌తిజోరి దర్శకత్వంలో రూపొందిన "ఖామోష్" సినిమాను తెలుగులోకి అనువదిస్తున్నారు. "ముద్దుగుమ్మ" పేరుతో నీనా క్రియేషన్స్ పతాకంపై ఎదురూరి అంజిబాబు నిర్మిస్తోన్న ఈ సినిమా అనువాద కార్యక్రమాలతో పాటు సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది.

ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత ఎదురూరి అంజిబాబు మాట్లాడుతూ.. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైందని, సెన్సార్ "ఎ" సర్టిఫికేట్ ఇచ్చిందన్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని మే రెండో వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత వెల్లడించారు.

ఈ చిత్ర కథ విషయానికి వస్తే... ఒక వర్షం కురిసిన రాత్రి పలు కారణాల దృష్ట్యా కొందరు హోటల్‌లో బస చేయాల్సి వస్తుంది. అలా వచ్చిన వారందరూ ఒకరి తరువాత ఒకరు హత్యకు గురవుతారు. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది చిత్ర ప్రధాన ఇతివృత్తమని నిర్మాత వివరించారు.

మర్డర్ మిస్టరీతో కూడిన సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అని అంజిబాబు వెల్లడించారు. ఈ సినిమాలో శిల్పాశెట్టిపై చిత్రీకరించిన పబ్‌సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలోని మిగిలిన పాత్రల్లో రాఖీ సావంత్, జూహీచావ్లా, మకరంద్ దేశ్‌పాండే ఇతర పాత్రలను పోషించారు. ఇంకా ఈ సినిమాకు మాటలు, పాటలు.. దండెరామకృష్ణారెడ్డి, సంగీతం.. జతిన్-లతిన్, సమర్పణ.. కల్లె కరుణాకర్, నిర్మాత.. ఎదురూరి అంజిబాబు, దర్శకత్వం.. దీపక్ తిజోరి.