Kshanam oka yugam Cinema comes on May second week | మే రెండో వారంలో "క్షణం ఒక యుగం"
|
రియాజ్‌ఖాన్ పోలీస్ కమీషనర్ పాత్రను పోషిస్తోంది. మహావిధ్వంసం జరిగి లక్షల సంఖ్యలో ప్రాణనష్టం కలిగేలా కుట్రపన్ని, ఓ యువకుడి కాలిబూట్లకు శక్తివంతమైన బాంబునమర్చుతారు విద్రోహశక్తులు.
ఆ విద్రోహ చర్య కారణంగా నగరంలో ఎటువంట పరిస్థితులు తలెత్తాయి? చివరికి ఆ మహా విధ్వంసాన్ని మన పోలీసుఅధికారులు ఎలా నివారించారనే ఆసక్తికరమైన ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని చిత్ర నిర్వాహకుడు ప్రసాద్ తెలిపారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా.. "క్షణం ఒక యుగం"గా నడిచతే ఈ చిత్రం యాక్షన్ ప్రేమికుల్ని అమితంగా అలరిస్తుందని ప్రసాద్ అన్నాడు.
తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ అంతే స్థాయిలో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనువాదాలు కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే రెండో వారంలో రాష్ట్రమంతటా విడుదల కానుంది.
