Vikram is in women phose | విక్రమ్ హీరోగా మల్ల(మ్మ)న్న
స్త్రీ రూపంలో విక్రమ్
|
ఈ మల్లన్న చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్స్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ దేశంలో పేదవారు మరీ పేదవారుగా, ధనవంతులు మరింత ధనవంతలుగా మారుతున్నారని దీనికి పరిష్కారం ఏమిటన్నది ఈ చిత్రంలో చూపినట్టు తెలిపారు.
ఈ చిత్రాన్ని నిర్మించిన నేపథ్యంలో తమిళనాడులో మాదిరిగానే తెలుగులో కూడా మల్లన్న ఫౌండేషన్ పేరుమీదుగా రెండు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ కనీస సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. హీరో విక్రమ్ మాట్లాడుతూ ఇది చక్కని సందేశంతో కూడిన చిత్రమన్నారు.
ఈ చిత్రంలో తాను వివిధ గెటప్పుల్లో కనిపిస్తానని ఈ చిత్ర నిర్మాణానికి ఏడాదిన్నర కాలం పట్టిందని అన్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ చక్కని సంగీతాన్ని అందించారని, తాను సైతం ఈ చిత్రంలో పాటలు పాడానని తెలిపారు.
