1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. 22న తెరపైకి వస్తోన్న "పిస్తా"

Vishal Pista ready for release on 22nd May | 22న తెరపైకి వస్తోన్న "పిస్తా"

వినోదం
WD
పందెంకోడి, పొగరు, భరణి, భయ్యా, సెల్యూట్ వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా మాస్ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న విశాల్ తాజాగా "పిస్తా"గా తెరపైకి రానున్నాడు.

జి.కె. ఫిలిమ్స్ కార్పొరేషన్ పతాకంపై ఎస్. అయ్యప్ప దర్శకత్వంలో విక్రమ్ కృష్ణ నిర్మిస్తున్న "పిస్తా" అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం గురించి విక్రమ్ కృష్ణ వివరాలను తెలియజేస్తూ.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన "పిస్తా" చిత్రాన్ని ఈ నెల 22న 200 ప్రింట్లతో రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నామన్నారు.

ఇప్పటివరకు విశాల్ చేసిన చిత్రాల్లో "పిస్తా" వైవిధ్యంతో ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. డైరక్టర్ అయ్యప్ప సబ్జెక్ట్‌ని అద్భుతంగా హ్యాండిల్ చేయడంతో సినిమా బాగా వచ్చిందన్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత వెల్లడించారు.

విశాల్, శ్రేయ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, అలీ, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, కృష్ణ భగవాన్, శ్రీనివాసరెడ్డి, అన్నపూర్ణ, కొండవలస, లక్ష్మణరావు, తెలంగాణ శకుంతల తదితరులు నటిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రానికి సంగీతం.. మణిశర్మ, మాటలు.. శశాంక్, పాటలు.. అనంత్ శ్రీరామ్, సాహితి, ఫైట్స్.. రాఖీ రాజేష్, కొరియోగ్రఫీ.. శోభి, దినేష్, కెమేరా.. ప్రియన్, నిర్వహణ.. వడ్డి రామానుజం, ఎడిటింగ్.. వి.టి. విజయన్.
About Writer
SELVI.M