Sumanth Boni ready for release | విడుదలకు సిద్ధమైన సుమంత్ "బోణీ"
|
సోమవారం ఈ చిత్రం గురించి అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సుమంత్ మాట్లాడుతూ.. ఇప్పటికే తొలికాపీ సిద్ధమైందని, త్వరలో సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. కథకంటే కథనంగా గొప్పగా ఉంటుందని తెలిపారు.
యూఎస్‌లో యూడ్ ఫిలిమ్స్ చేసిన రాజా తొలిసారిగా తెలుగు సినిమాకు దర్శకత్వం వహించినా, ఆయన భీమవరంకు చెందిన వారు కావడంతో మన నేటివిటీకి, ఆధునీకత ఆలోచనలకు అనుగుణంగా చిత్రాన్ని మలిచారన్నారు.
నిర్మాత రమణగోగుల క్రియేటివ్ బిజినెస్ చేస్తూనే సినిమాలో కొత్తదనం చూపే రీతిలో ఈ సినిమాను నిర్మించారని సుమంత్ వివరించారు. ఓ ఆశయం కోసం హీరో ఏం చేశాడన్నది కథని సుమంత్ అన్నారు. సంగీత పరంగా రమణగోగుల మ్యూజిక్ ఇప్పటికే ప్రజాదరణ పొందిందన్నారు.
