1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. జూన్ 9న తెరపైకి మగధీర!

All are waiting for ‘Maghadheera’ | జూన్ 9న తెరపైకి మగధీర!

వినోదం
WD
మెగాస్టార్ తనయుడు, చిరుత ఫేమ్ యంగ్ హీరో రామ్ చరణ్ తేజ కథానాయకుడిగా నటించే తాజా చిత్రం "మగధీర". వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను జూన్ తొమ్మిదో తేదీన రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సమాచారం.

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, చందమామ ఫేమ్ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న "మగధీర" త్వరలో ప్రేక్షకులకు కనువిందు చేస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. ఇకపోతే.. అల్లు అరవింద్ ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.