PremRajyam| Hindu| Muslim| Ramkrishna| Meera krishna | 26న తెరపైకి హిందూ ముస్లింల "ప్రేమ్రాజ్యమ్"
|
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయన్నారు. సమాజంలో పేరుకుపోతున్న అంతరాలను తొలగిస్తూ, మనుషులంతా కలిసి, మెలసి జీవించాలనే సందేశాన్ని అంతర్గతం ప్రబోధించి మానవతా విలువలను తట్టి లేపే చిత్రమదని దర్శకుడు చెప్పారు.
రాజు సంగీతం శ్రోతలను తప్పకుండా అలరిస్తుందని, దేశభక్తి గీతం, క్లాసికల్‌సాంగ్‌తో పాటు ఆకట్టుకునే పాటలు ఈ చిత్రంలో ఉన్నాయని జె.ఎస్.రావు వివరించారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాలో కడుపుబ్బ నవ్వించే కామెడీ అద్భుతంగా ఉంటుందని ఆయన తెలిపారు.
ఇకపోతే.. ఈ చిత్రం ద్వారా తమకు మంచి గుర్తింపు వస్తుందని రామ్‌కిరణ్, మలయాళ నటి మీరాకృష్ణలు ఆశించారు. గతంలో కొన్ని చిత్రాల్లో నటించినా పూర్తి స్థాయి విలన్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నానని మురళీకృష్ణంరాజు పేర్కొన్నారు.
ఇంకా ఈ చిత్రంలో అన్నపూర్ణ, రంగనాథ్, రఘునాథరెడ్డి, ఎం.ఎస్. జీవా, గుండు హనుమంతరావు, జయవాణి, హేమసుధ తదితరులు నటించారు.
కెమేరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, సమర్పణ: లోహితేశ్వర్, ఎడిటింగ్: మోహన్ రామారావు, ఆర్ట్: రాజు, కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జె.ఎస్.రావు.
