నాని, తనీష్, అక్ష, శ్వేతబసు ప్రసాద్‌లు ప్రధాన తారాగణంగా నటిస్తున్న "రైడ్" చిత్రం ఈ నెల ఐదో తేదీన విడుదల కానుంది.
రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బెల్లం కొండ సురేష్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. పూర్తి యూత్ యాక్షన్ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో సెంటిమెంట్ అంశాలు కూడా ఉన్నాయని నిర్మాత చెప్పారు.
ఇప్పటికే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందని, ఇదే తరహాలో సినిమా కూడా హిట్టవ్వాలని బెల్లంకొండ ఆకాంక్షించారు.
సెంటిమెంట్ అంశాలతో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. నాని, తనీష్, అక్ష, శ్వేతబసుల నటన రైడ్‌లో చక్కగా అమరిందని నిర్మాత ప్రశంసించారు.