గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » 19న తెరపైకి సుశాంత్ "కరెంట్" (Susanth| curent| Sneha ullal| Nagarjuna)
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
WD
నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా, స్నేహా ఉల్లాల్ హీరోయిన్‌గా నటించిన "కరెంట్" చిత్రాన్ని ఈ నెల 19న విడుదలచేయనున్నట్లు చిత్ర నిర్మాత శ్రీనివాసరావు, నాగసుశీలలు చెప్పారు.

గురువారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోకరెంట్ నిర్మాతలు మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందన్నారు. ఇదే తరహాలో సినిమా కూడా విజయం సాధించాలని నిర్మాతలు ఆశించారు. ఈ సినిమాను 200 థియేటర్లలో విడుదలచేస్తున్నామని తెలిపారు. త్వరలో సెన్సార్ పూర్తి కానుందని చెప్పారు.

సుశాంత్ మాట్లాడుతూ.. ఆడియోలో ఇంతకుముందు ఐదు పాటలే ఉన్నాయని, మరో పాటను కూడా జతచేశామని చెప్పారు. ప్లాటినం డిస్క్ వేడుకను ఈ నెలాఖరులో విజయవాడలో నిర్వహిస్తామని హీరో సుశాంత్ అన్నారు. విదేశాల్లో ఉన్న తన స్నేహితులు కూడా ఆడియోకు మంచి రేటింగ్ ఇచ్చారని తెలిపారు.

దర్శకుడు ప్రతాప్ మాట్లాడుతూ.. టీమ్ వర్క్‌తో చిత్రాన్ని అద్భుతంగా మలిచామన్నారు. కథకు అనుగుణంగానే టైటిల్ పెట్టామని, కాళిదాసు చిత్రం చూసి సుశాంత్ తగిన కథను రాశానని వెల్లడించారు. ఈ చిత్రం ద్వారా సుశాంత్ ఆదరిస్తారని నాగసుశీల ఆశాభావం వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సుశాంత్, కరెంట్, స్నేహా ఉల్లాల్, నాగార్జున