1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Sumanth

Boni| Sumanth| Kruti Karbanda| Green Mangoes | 12న తెరపైకి వస్తోన్న సుమంత్ "బోణీ"

సుమంత్
యూత్ హీరో సుమంత్ కథానాయకుడిగా కృతికరబంద కథానాయికగా నటిస్తోన్న చిత్రం "బోణీ". గ్రీన్‌ మ్యాంగోస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాజా దర్శకునిగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమాను సంగీత దర్శకుడు రమణ గోగుల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న బోణీ చిత్రాన్ని ఈ నెల 12వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ సినిమాలో సుమంత్ అద్భుతంగా నటించాడని ఆయన తెలిపారు. ఇందులో సీరియస్ క్యారెక్టర్‌ను పోషించిన సుమంత్‌కు ధీటుగా కృతి చక్కగా నటించిందని దర్శకుడు చెప్పారు. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
About Writer
SELVI.M