గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » జూలై 27న తెరపైకి వస్తోన్న వర్మ 'అడవి' (RamGopal Varma| Adavi| Nithin| Nisha Kothari)
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
WD
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ డైరక్షన్‌లో, నితిన్‌ హీరోగా నటించిన చిత్రం 'అడవి'. హిందీ, తెలుగు భాషల్లో యుటివి మోషన్‌ పిక్చర్స్‌ సమర్పణలో, ఎ డ్రీమ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై "అడవి" చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా ట్రైలర్స్‌ను శుక్రవారం రాత్రి ప్రదర్శించారు.

ఈ సందర్భంగా నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. దర్శకుడిగా తన కెరీర్‌ ప్రారంభమైనప్పటి నుంచి థ్రిల్లర్‌ సినిమాలే చేస్తున్నానని గుర్తు చేశారు. కథ గురించి చెప్పాలంటే.. ఈసారి సినిమా నేపథ్యాన్ని ఎంచుకున్నానన్నారు. ఒక చిత్ర యూనిట్‌ అడవికి వెళుతుంది.

అక్కడ ఓ రూపంలేని మృత్యువు యూనిట్‌లోని వారిని ఒక్కొక్కరిగా చంపుతుంది. నితిన్‌ ఇందులో అసిస్టెంట్‌ డైరెక్టర్‌. మిగిలిన వాళ్లలో డైరెక్టర్‌, లైట్‌బారు, హీరోయిన్‌ ఇలా అందరూ ఉంటారు. వీరందరికీ ఒక్కో స్టేటస్‌ ఉంటుంది. దాంతో ఏ మాత్రం కాంప్రమైజ్‌కారు. అయితే ప్రాణభయం పట్టుకున్న తర్వాత ఎలాంటి తారమత్యాలు చూడక అందరూ ఒకటై పోరాడుతారని రామ్‌గోపాల్ వర్మ తెలిపారు.

ఇది సైకో థ్రిల్లర్‌. కెమెరాముందు హీరోయిజం ప్రదర్శించిన కథానాయకుడు ప్రాణభయం పట్టుకున్న తర్వాత పిరికివాడవుతాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయిన నితిన్ హీరోయిజాన్ని ప్రదర్శిస్తాడు.

ఇది ఎవరినీ ఉద్దేశించి తీసిందికాదని, తన ఆలోచనలకు తెరపై పెట్టానంతేనని వర్మ వివరించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 27న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నితిన్, నిషా కొఠారి తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: రామ్గోపాల్ వర్మ, అడవి, నితిన్, నిషా కొఠారి, తెలుగు, హిందీ, సైకో థ్రిల్లర్