1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Siddarth

Oy| Siddarth| Anjali Papa| Shamili| First Love | త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న"ఓయ్"

తొలిప్రేమ
WD
జీవితంలో తొలిప్రేమను ఎప్పటికీ మరిచిపోరనే కాన్సెప్ట్‌తో "ఓయ్" అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది.

లవర్ బాయ్ సిద్ధార్థ హీరోగా, అంజలి పాప షామిలి హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా త్వరలో తెరపైకి రానుంది.

ఓయ్ చిత్రం ద్వారా చాలాకాలం తర్వాత షామిలి హీరోయిన్‌గా రావడంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. యూనివర్శల్ మీడియా పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.

డి.వి.వి దానయ్య నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సిద్ధార్థ తండ్రిగా కోలీవుడ్ నటుడు నెపోలియన్ నటిస్తున్నారు.

ఇంకా.. ఆనంద్ రంగ దర్శకత్వం వహిస్తున్న "ఓయ్" సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
About Writer
SELVI.M