నాగబాబు, ప్రేమ జంటగా, రమ్యకృష్ణ, సునీల్‌వర్మ సీతారాములుగా నటించిన చిత్రం "అంజనీపుత్రుడు".
ఈ చిత్రానికి కె. చంద్రశేఖర్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు సహ నిర్మాతలు సి.హెచ్. సాయిరమేష్, శేఖర్ కల్లూర్ చెప్పారు.
ఈ సినిమా గురించి దర్శక, నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ... సోషియో ఫాంటసీ చిత్రంగా అంజనీపుత్రుడు తెరకెక్కనున్నాడని చెప్పారు. పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే ఈ సినిమాలో హనుమాన్ చేసే సాహసకృత్యాలు పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిపారు.
గ్రాఫిక్‌వర్క్ అద్భుతంగా వచ్చిందని, వందేమాతరం శ్రీనివాస్ అందించిన ఆడియోకు మంచి ప్రజాదరణ లభించిందని దర్శక, నిర్మాత వెల్లడించారు. ఆంజనేయస్వామిపై జొన్నవిత్తుల రాసిన గీతాలు ప్రజాదరణ పొందాయని, ఇటువంటి చిత్రాన్ని తాము నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.
ఇంకా ఈ చిత్రంలో ఎం.ఎస్. నారాయణ, రామిరెడ్డి, చంద్రమోహన్, కాస్టూమ్స్ కృష్ణ, సత్యంరాజేష్, మాస్టర్ భరత్, అపూర్వ, శేఖర్ కల్లూరి, ప్రాచి, బల్వాన్, హేమసుందర్ తదితరులు నటించారు. కెమెరా: మోహన్‌చంద్, మాటలు: దాసరి బ్రహ్మం, పాటలు: జొన్నవిత్తుల, కరుణాకర్, ఫైట్స్: నందు, ఎడిటింగ్: సాయిరమేష్.