1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. AVM

Evaraina Epudaina| AVM| Varun Sandesh| Vimala Raman| Marthand Shankar | 26 వస్తోన్న "ఎవరైనా ఎప్పుడైనా"

ఎవరైనా ఎప్పుడైనా
హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా, విమలారామన్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "ఎవరైనా ఎప్పుడైనా" (ప్రేమలో పడొచ్చు).

హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాల ద్వారా హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ "ఎవరైనా ఎప్పుడైనా" ద్వారా మరో హిట్ కొట్టేందుకు సై అంటున్నాడు.

మార్తాండ్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. ప్రతిష్టాత్మక ఏవీఎం పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ టాలీవుడ్ మూవీపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఐదేళ్ల గ్యాప్ అనంతరం ఏవీఎం బ్యానర్‌పై విడుదల కానున్న లవ్లీ ఎంటర్‌టైనర్‌ "ఎవరైనా ఎప్పుడైనా" సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు వెల్లడించారు.
About Writer
SELVI.M