చైనాలోని ఓ అమ్మాయి రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిన చిత్రాన్ని తెలుగులో "నింగి నేల నాదే"గా చావా సుధారాణి డబ్బింగ్ చేశారు. ఈ చిత్రాన్ని జూలై 3న విడుదల చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఫెంగ్ బెంజి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్‌లో అవార్డు కూడా సాధించింది.
ఈ చిత్రం గురించి దిల్‌రాజు మాట్లాడుతూ.. మంచి చిత్రాలను నిర్మించడంలో తమ సంస్థ ముందుంటుందన్నారు. అందుకే ఈ చిత్రాన్ని చూసి తమ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయాలనుకున్నామని వివరించారు. ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని సుధారణి అనువదించారు. ఎన్నో చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు దిల్‌రాజు చెప్పారు.
WD
రమేష్‌ప్రసాద్ మాట్లాడుతూ.. కమర్షియల్ చిత్రాలు ఆదరణ పొందుతున్న తరుణంలో ఇటువంటి చిత్రాలు ఆదరణ పొందాలన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలకు తన వంతు సాయం చేశానని తెలిపారు.
సుజన్‌మీడియా వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తున్న ఈ చిత్రం 21సెంచురీ పతాకంపై రూపొందింది. తొలివిడతగా ఈ చిత్రం హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లలో విడుదల కానుంది.