1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Morning Walk

Anupam Kaur| Morning Walk| Sharmila Tagoor| Rajith Kapoor| Divya Dutta | "అనుపమ్‌ఖేర్" కీలక పాత్రలో "మార్నింగ్‌వాక్"

అనుపమ్ఖేర్
WD
రెండు కుటుంబాల మధ్య జరిగే అందమైన కథ 'మార్నింగ్‌వాక్'. ఐనాక్స్ మోషన్‌ పిక్చర్‌ ప్రొడక్షన్స్‌పై తొలి చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో అనుపమ్‌ఖేర్‌, షర్మీలా ఠాగూర్‌, రజిత్‌ కపూర్‌, దివ్యా దత్త ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కథాపరంగా చూస్తే.. జారు మోహన్‌ (అనుపమ్‌ ఖేర్‌) కొల్‌కతలో ప్రోఫేసర్‌గా పనిచేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల తన నివాసాన్ని ముంబైకి మారుస్తాడు. ఓ రోజు మార్నింగ్‌వాక్ చేస్తుండుగా తన ఓల్డ్‌ స్టూడెంట్‌ మరియు ఫ్రెండ్‌ అయిన నీలిమ (షర్మిలా ఠాగూర్‌) కలుస్తుంది. జారుమోహన్‌కు నీలిమ కుటుంబంతో గాఢానుబంధం ఏర్పడుతుంది. ఈ సంఘటన అతని జీవితంలోనే గాక ఆ రెండు కుటుంబాలలో అనూహ్యమైన మలుపులకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో "మార్నింగ్‌వాక్" తెరకెక్కనుంది.

ఈ సినిమా గురించి ఐనాక్స్ మోషన్‌ పిక్చర్స్ డైరక్టర్‌ అలోక టాండన్‌ మాట్లాడుతూ.. "మార్నింగ్‌వాక్" తమ ప్రొడక్షన్స్‌లో వస్తున్న తొలి చిత్రమన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌చేసి నిర్మించిన చిత్రమిదని, అత్యుత్తమ చిత్రాలతో ప్రేక్షకులను ఆనందపరచడమే లక్ష్యంగా ఐనాక్స్ మోషన్‌ సినిమా ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టిందని టాండన్ అన్నారు. ఎగ్జిబిషన్‌ ఇండస్ట్రీలో పేరొందిన సంస్థగా ఐనాక్స్ నిలబడింది. అదే పంథాని సినిమా ప్రొడక్షన్‌లోనూ కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు.
About Writer
SELVI.M