Oyy | Sidhardha | Shamili | Maniratnam | మణిరత్నం శిష్యులూ.. షాలిని చెల్లెలూ... ఓయ్ ఓయ్!!
|
ఈ చిత్రంలో హీరోగా నటించిన సిద్దార్థ, దర్శకుడుగా పనిచేసిన ఆనంద్ రంగ ఇద్దరూ మణిరత్నం శిష్యులట. బాంబే చిత్ర నిర్మాణ సమయంలో ఇద్దరూ మణిరత్నం వద్ద సహ దర్శకులుగా పనిచేశారట. ఆనంద్ దర్శకత్వ శాఖలో అలానే కొనసాగగా సిద్దార్థ మాత్రం నటనవైపు మొగ్గు చూపాడు. తనకంటూ ఓ ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు.
వీళ్లద్దరి సంగతి అలావుంచితే 'ఓయ్'తో హీరోయిన్‌గా షాలిని చెల్లెలు బేబీ షామిలి పరిచయమవుతోంది. అక్క షాలిని వద్ద సక్సెస్ సూత్రాలేమిటో తెలుసుకుని షాలిని రంగంలో దిగినట్లు సమచారం. మొత్తమ్మీద మణిరత్నం శిష్యులూ... షాలిని చెల్లెలూ.. ఆపై దానయ్య నిర్మాత. అన్నీ కలిసి టాలీవుడ్ ప్రేక్షకులను "ఓయ్.. ఓయ్" అనిపిస్తుందో లేదో చూడాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే..
