1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Kamalini Mukarjee

Venu| Kamalini Mukarjee| Gopi Gopika Godavari| Vamsi | 10న వస్తోన్న ''గోపి గోపిక గోదావరి''

వేణు
WD
వేణు, కమలినీ ముఖర్జీ హీరోహీరోయిన్లుగా నటించిన 'గోపి గోపిక గోదావరి'. వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత వల్లూరిపల్లి రమేష్‌ అన్నారు.

ఇటీవలే ఆదిత్య ద్వారా విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందనీ, ఎక్కువ భాగం ఈ పాటలను రింగ్‌టోన్స్‌గా కూడా ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు.

ఆడియో ప్రజాదరణ సందర్భంగా మంగళవారంనాడు 'గోపి గోపిక గోదావరి' ప్లాటినం డిస్క్‌వేడుక హైదరాబాద్‌‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీతదర్శకుడు చక్రి, కొండవలస, కృష్ణభగవాన్‌, జీవా, రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందరభంగా చక్రి మాట్లాడుతూ, పాటలురాసిన రామజోగయ్యశాస్త్రిని అభినందించారు. వంశీమార్కుతరహాలోనే కామెడీతోపాటు అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయన్నారు. ఈ చిత్రంలో పాటలు పాడిన గాయనీగాయకులు మధుమిత్ర, వాసు, వేణు ప్లాటినం డిస్క్ సందర్భంగా పాటలు పాడి వినిపించారు. రామగోజయ్యశాస్త్రి మాట్లాడుతూ.. ఈ సినిమాలోని అన్ని పాటలు రాసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.

జీవితాన్ని మార్చేసిన ఆ రెండు పదాలు..
తాను వాడిన రెండు పదాలు- ఐతే.. ఓకే.. అనేవి తన సినీ జీవితాన్ని మార్చేశాయని నటుడు కొండవలస లక్ష్మణరావు అన్నారు. రంగస్థల నటుడిగా పలు అవార్డులు పొంది వైజాగ్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేసి దాన్ని వదులుకుని సినిమా రంగంపై వ్యామోహంతో హైదరాబాద్‌ వచ్చాననీ, రాగానే పెద్ద వంశీగారి చిత్రంలో అవకాశం రావడంతో ఎగిరి గంతేశానని గుర్తుచేసుకుంటూ.. 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు'లో తనకు ఐతే.. ఓకే.. పదాలను ఎక్కువగా పలికించే సన్నివేశాన్ని ఇచ్చారు.

అదికూడా వైవిధ్యంగా ఉండాలన్నారు. అందుకే మాటను నొక్కిపలుకుతూ వాడాను. అది నా జీవితాన్నే మార్చేసిందని.. చెమ్మగిల్లిన కళ్ళతో కొండవలస వంశీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం "గోపి.. గోపిక... గోదావరి" చిత్రంలోనూ వైవిధ్యమైన పాత్రను పోషించానని చెప్పారు.

షూటింగ్‌ చేసేటప్పుడు ఆయన నుంచి చాలా నేర్చుకున్నాననీ, క్రమశిక్షణ, నిగర్విగా మెలగడం, పెద్దలను గౌరవించడం వంటి మూడు మాటలను ఆయన తనకు నేర్పారనీ.. అవి ఈ వయస్సులోకూడా తనకెంతో ఉపయోగపడ్డాయని అన్నారు.
About Writer
SELVI.M