Vyapari| S.J. Surya| Tamanna| Namitha| Malavika | క్లోనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న "వ్యాపారి"
తమిళంలో రూపొందిన "వ్యాపారి"ని తెలుగులో అదే పేరుతో ప్రణతి క్రియేషన్స్‌పై కూనిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనువదించారు. ఈ చిత్రాన్ని ఈనెల 11న విడుదలచేస్తున్నట్లు బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత తెలియజేశారు. మనిషిని పోలిన మనిషిని చేసే క్లోనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్ర కథ రూపొందిందని చెప్పారు.
ఖుషి దర్శకుడు ఎస్.జె. సూర్య ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఓ వ్యక్తి కోటీశ్వరునిగా మారిన తర్వాత ఏం జరుగుతుందనేది ఈ చిత్రకథని నిర్మాత చెప్పారు. ఇందులో పాటలన్నీ బాగున్నాయని, మంజునాథ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విడుదలచేస్తోందని నిర్మాత తెలిపారు.
దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య మాట్లాడుతూ, దర్శకుడిగా పరిచయమైన తాను ఈ చిత్రంలో హీరోగా కన్పిస్తాను. ఇందులో అమ్మపాట అద్భుతంగా ఉంటుందని చెప్పారు. తమిళంలో హిట్టయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని సూర్య ఆశించారు. ఈ కథను తమిళనాడులో సక్సెస్‌ఫుల్ డైరక్టర్ శక్తి చిదంబరం చెప్పారు.
