Deepavali| Komaram Puli| Preview| Pavan Kalyan| S.J.Surya| Kushi | దీపావళికి తెరపైకి వస్తోన్న "కొమరం పులి''!
|
ప్రస్తుతం హైదరాబాద్‌లో కొమరం పులి షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఈ సినిమా గురించి చెబుతూ.. పులి ఎంతటి పవర్‌ఫుల్లో ఇందులో హీరో పవన్‌కళ్యాణ్ కూడా అంతటి పర్‌ఫుల్ రోల్ చేస్తున్నాడని చెప్పారు. పవన్‌కళ్యాణ్‌లో డెడికేషన్ ఎంతో నచ్చిందని సూర్య కితాబిచ్చాడు.
ఉదయం 5 గంటలకు రావాలంటే ఆ టైమ్‌కు సెట్లో ఉంటారనీ, రాత్రి ఆలస్యమయినా మళ్ళీ ఉదయమే షాట్‌కు సిద్ధమవుతారని పవన్‌నుద్దేశించి చెప్పారు. తమ కాంబినేషన్‌కు టాలీవుడ్ మంచి క్రేజ్ లభించిందని దర్శకుడు అన్నారు.
ఇప్పటికే బిజినెస్‌పరంగా ఆశాజనకంగా ఉన్న ఈ చిత్రాన్ని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దీపావళికి విడుదల చేస్తున్నట్లు సూర్య తెలిపారు. తమిళంలో తానే హీరోగా "పులి" చిత్రాన్ని రూపొందిస్తున్నానని సూర్య పేర్కొన్నారు.
