1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. జూలై 24న "ఆంజనేయులు" ఆడియో విడుదల

Anjaneyulu Audio, July 24, Raviteja, Nayanatara | జూలై 24న "ఆంజనేయులు" ఆడియో విడుదల

క్రేజీస్టార్
WD
క్రేజీస్టార్ రవితేజ, అందాలతార నయనతార జంటగా పరశురామ్ దర్శకత్వంలో నటుడు గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం ఆంజనేయులు షూటింగ్ పూర్తికావస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ... " జూలై 24న ఆంజనేయులు చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నాం. రవితేజ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ చిత్రంగా ఆంజనేయులు సంచలనం క్రియేట్ చేస్తుంది" అన్నారు.

క్రేజీస్టార్ రవితేజ, అందాల తార నయనతార జంటగా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండె, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, రాజా రవీంద్ర, ఎం.ఎస్ నారాయణ, సన, వినయ ప్రసాద్, మాస్టర్ భరత్, జీవా, 'సత్యం' రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: కె. రవీద్రబాబు, సంగీతం: ఎస్. తమన్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఆర్ట్: చిన్నా, ప్రొడక్షన్ కంట్రోలర్: జి.జి.కె. రాజు, నిర్మాత: గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: పరశురామ్ ( బుజ్జి)
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT