1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Vengamamba

Meena| Vengamamba| Annamacharya| Ananth| Vilanisam | 17న ''వెంగమాంబ''గా తెరపైకి వస్తోన్న మీనా

మీనా
WD
ప్రముఖ నటి మీనా తరిగొండ "వెంగమాంబ"గా నటించిన చిత్రాన్ని ఈనెల 17న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత వి. దొరస్వామిరాజు తెలియజేశారు.

బుధవారం ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, ప్రారంభం నుంచి ఎలాంటి విఘ్నాలు లేకుండా చిత్రాన్ని పూర్తిచేశామన్నారు.

అన్నమాచార్యులు తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామిని కీర్తించిన కవయిత్రి తరిగొండ వెంగమాంబ. కొండపై ఆయన కొలువున్నంతవరకు ఈమె పేరు నిలిచిపోతుంది. 17వ శతాబ్దానికి చెందిన వెంగమాంబ 17 గ్రంథాలను రచించింది. అన్నమయ్య తర్వాత వెంగమాంబ చిత్రాన్ని తీయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని నిర్మాత వెల్లడించారు.

నటుడు అనంత్‌ మాట్లాడుతూ.. తాను ఈ చిత్రంలో వెంగమాంబను పెండ్లిచేసుకోవాలని ఆమెను ఏడిపించే పాత్రను చేశాను. తొలిసారిగా విలనిజం ఉన్న పాత్ర ఇదని చెప్పారు.