1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Indra

Putrudu| Indra| Comedy| Thriller| Songs| Post Production | మూడు పాటలు మినహా పూర్తయిన ''పుత్రుడు''

పుత్రుడు
ఇంద్ర హీరోగా ఫ్రెండ్స్‌ ఫిలిమ్స్‌ అకాడమీ పతాకంపై పాన్‌ అమెరికా సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'పుత్రుడు' (ఎ మెడికో). శ్రావణ్‌ కుమార్‌ బాపట్ల దర్శకత్వంలో బొద్ద ఇంద్రసేన నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ 3 పాటలు మినహా పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఈ నెలలోనే రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు.

ఈ నేపథ్యంలో నిర్మాత, చిత్ర కథానాయకుడు ఇంద్ర మాట్లాడుతూ, మార్షల్‌ ఆర్ట్స్‌లో నైపుణ్యం ఉన్న తన బాడీ లాంగ్వేజ్‌కు తగిన పాత్ర లభించిందన్నారు. ఇందులో రెండు కోణాలున్న పాత్ర తనదని, నటుడిగా తనకు సవాల్‌గా భావిస్తున్నానని చెప్పారు.

ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ఫిలింసిటీలోని సింఫనీ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయని ఇంద్ర తెలియజేశారు. ఇకపోతే.. ఈ నెలాఖరులో ఆడియోను, ఆగస్టులో సినిమాను విడుదలచేయాలనుకుంటున్నామని తెలిపారు.

దర్శకుడు శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ''పరుసవేది" అనే పాయింట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. బంగారం తయారుచేసే కళలో కూడిన కథాంశంతో సస్పెన్స్‌, థ్రిల్లర్‌, కామెడీతో "పుత్రుడు" ప్రేక్షకుల ముందుకు రానున్నాడని చెప్పారు.

మరో కోణంలో అనాథ శవాలకు అంతిమ క్రియలు చేసే ట్రస్ట్‌కు సంబంధించిన విషయాలు కూడా ఇందులో మిళితమై ఉన్నాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు మా "పుత్రుడు" వైవిధ్యమైన అనుభూతినిస్తాడని దర్శకుడు ఆశించారు.

అరుణ్‌, బిందు, తనీషా, జీవా, ఎం.ఎస్‌. నారాయణ, సూర్య, దువ్వాసిమోహన్‌, రాజేందర్‌, కొండవలస, ఉత్తేజ్‌, కవిత, నల్లవేణు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: వి.ప్రభాకర్‌, సంగీతం: వై. సత్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే దర్శకత్వం: శ్రావణ్‌ బాపట్ల.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT