1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. ఆగస్టు 15న తెరపైకి రానున్న "పోలీస్‌ స్టైల్‌"

Police Style, Cinema, Preview, Sanghavi, Uday, August 15 | ఆగస్టు 15న తెరపైకి రానున్న "పోలీస్‌ స్టైల్‌"

పోలీస్ స్టైల్
సంఘవి, ఉదయ్ హీరోహీరోయిన్లుగా జై భవాని క్రియేషన్స్‌ పతాకంపై చిన్న శ్రీశైలం యాదవ్‌ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "పోలీస్ స్టైల్".

ఆర్‌.ఆర్‌. దేవరపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ఎ. రాజు సాగర్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధమౌతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆనంద్‌ మాస్టర్‌ ఆధ్వర్యంలో రామిరెడ్డి, అల్లరి సుభాషినిపై చిత్రీకరించిన సాంగ్‌ ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తుందన్నారు.

నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సంఘవి పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. చక్కని సందేశంగా కూడా ఉంది. ఈ సినిమా ద్వారా ఉదయ్ హీరోగా పరిచయం అవుతున్నారు.

పిల్లలను కిడ్నాప్‌చేసే గ్యాంగ్‌లో పోలీసు అధికారి చాకచక్యంగా చొరబడి వారి ఆటను ఎలా కట్టించాడన్నదే ఈ చిత్ర కథాంశమని దర్శకుడు వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు.

ప్రసన్నకుమార్‌, రామిరెడ్డి, జ్యోతి, కావేరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ధనుంజయ్, సంగీతం: శశి, సహనిర్మాత: వి. రమేష్‌యాదవ్‌.
About Writer
SELVI.M