1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Yagam

Navadeep| Yagam| Preview| Bollywood| Kim Sharma| Bhumika | విడుదలకు సిద్ధమైన నవదీప్ "యాగం"

నవదీప్
WD
"చందమామ" ఫేమ్ నవదీప్ హీరోగా నటిస్తోన్న "యాగం" సినిమా విడుదలకు సిద్ధమైంది.

ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. బాలీవుడ్ సెక్సీతార కిమ్ శర్మ, అందాల రాశి భూమిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో నవదీప్, కిమ్‌శర్మలు ఓ బార్‌లో పనిచేస్తున్నట్లు నటిస్తుండగా, భూమిక ఎయిర్ హోస్టెస్‌ పాత్రను పోషిస్తోంది. థాయిలాండ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి పి. ఎ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

భూమిక, కిమ్‌శర్మ, నవదీప్‌ల చుట్టే కథ నడుస్తుందని, ఇండియా, బ్యాంకాక్‌లలో జరిగే యాక్షన్ సన్నివేశాల సమ్మేళనమే ఈ "యాగం" అని దర్శకుడు వివరించారు.

ఇందులో భూమిక పాత్ర కీలకమైందని, హిందూ పురోహితునిగా అలీ కన్పిస్తారని దర్శకుడు చెప్పారు. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. పి.ఎ. అరుణ్‌ప్రసాద్, సమర్పణ... భరత్ ఠాకూర్, నిర్మాణం... సిల్వర్ స్క్రీన్ మూవీస్.
About Writer
SELVI.M