1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Namitha

Jaganmohini| Namitha| Raja| Meera Chopra| Jyothi Lakshmi| Graphics| Glamour | త్వరలో తెరపైకి వస్తానంటోన్న"జగన్మోహిని"

జగన్మోహిని
సెక్సీడాళ్ నమిత త్వరలో "జగన్మోహిని"గా తెరపైకి వస్తానంటోంది. 1980 ప్రారంభంలో విడుదలైన "జగన్మోహిని" చిత్రాన్ని ప్రస్తుతం రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నమిత టైటిల్ పాత్రను పోషిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి సముద్ర గర్భంలో చిత్రీకరించిన కొన్ని అద్భుత సన్నివేశాల కోసం నమిత "స్కూబ్ డైవింగ్" కూడా నేర్చుకుంది. తమిళం, తెలుగు భాషల్లో రూపుదిద్దుకుంటోన్న "జగన్మోహిని" సినిమాపై సెక్సీ తార నమిత ఆశలు పెట్టుకుంది.

రాజా, మీరాచోప్రా, నరసింహరాజు, అలనాటి తార జ్యోతిలక్ష్మి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను ముగించుకుని చివరి దశలో ఉంది. గ్రాఫ్రిక్స్, టెక్నికల్ పరమైన కార్యక్రమాల కోసం ఈ చిత్రం విడుదలకు జాప్యం జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది.

ఎన్.కె. విశ్వనాథన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి మురళీ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. జ్యోతిలక్ష్మి, ఐటంసాంగ్, నమిత, మీరా చోప్రాల గ్లామర్, అత్యాధునిక టెక్నికల్ ప్రమాణాలు, గ్రాఫిక్స్‌లతో "జగన్మోహిని" తప్పకుండా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.