KonaSeemalo Chitemma Kittaya| Gurlin Chopra| RamBabu | త్వరలో తెరపైకి "కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య"
WD
ఈ సినిమా గురించి నిర్మాత, హీరో ఆళ్ళ రాంబాబు మాట్లాడుతూ.. సెన్సార్‌ను పూర్తి చేసుకుని త్వరలో తొలికాపీ సిద్ధం కానుందన్నారు. లలిత్ సురేష్ సంగీతం సమకూర్చిన ఆడియోను ఈ వారంలో విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. లండన్‌కు చెందిన మానసిక వైద్యుడు మాదిన రామకృష్ణ ఇందులో విలన్‌గా నటించారని ఆయన చెప్పారు.
రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ చిత్రంలో విలన్‌గా భూస్వామి పాత్రలో చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
హీరోయిన్ గుర్లిన్ చోప్రా మాట్లాడుతూ.. గ్లామర్ ప్లస్ పెర్‌ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రను ఈ చిత్రంలో చేశానన్నారు. ఈ సినిమా తన సెకండ్ ఇన్నింగ్స్‌కు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశించారు.
మలయాళంలో ఏడాదిపాటు ఆడిన "కరుమాడికుట్టన్"ను ఆధారంగా మన కోనసీమ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొదించామని దర్శకుడు భరత్ పారేపల్లి వెల్లడించారు. "పదహారేళ్ళ వయసు"లో చంద్రమోహన్ పోషించినటువంటి వయసు పెరిగినా మనసు ఎదగని యువకుడి పాత్రను ఆళ్ళ రాంబాబు చక్కగా చేశారన్నారు.
చంద్రమోహన్, రజిత, రవిప్రకాశ్, అజిత్ మోహన్, ఎం. బాలయ్య, ద్రాక్షరామం సరోజిని నటిస్తున్న ఈ చిత్రాకోననికి పాటలు: మాస్టర్ జి, సినిమాటోగ్రఫీ: గాదిరాజు శ్రీను, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్ పారేపల్లి.
