Anjaneyulu| Raviteja| Nayantara| Bujji| Ganesh Babu| August 12 | ఆగస్టు 12న తెరపైకి వస్తోన్న "ఆంజనేయులు"
WD
ఈ సందర్భంగా నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ.. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆంజనేయులు ఆడియోను సూపర్‌హిట్ చేసిన శ్రోతలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఆగస్టు 12న "ఆంజనేయులు" చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచేలా "ఆంజనేయులు" రూపుదిద్దుకున్నాడని తెలిపారు.
క్రేజీస్టార్ రవితేజ, అందాలతార నయనతార జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండే, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, నాజర్, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, రాజా రవీంద్ర, ఎం.ఎస్. నారాయణ, సన, వినయప్రసాద్, మాస్టర్ భరత్, జీవా "సత్యం", రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: కె. రవీంద్రబాబు, సంగీతం: ఎస్. తమన్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఆర్ట్: చిన్నా, ప్రొడక్షన్ కంట్రోలర్: జి.జి.కె. రాజు, సమర్పణ: శివబాబు, నిర్మాత: గణేష్ బాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరుశురామ్ (బుజ్జి).
