1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Trisha

Gopichand | Trisha | Sankham | Ramoji film city | గోపీచంద్‌- త్రిషల "శంఖం" షూటింగ్ పూర్తి

గోపీచంద్
WD
ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావులు శ్రీ బాలాజీ సీనీమిడియా పతాకంపై అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న క్రేజీ చిత్రం ''శంఖం''కి సంబంధించిన ఓ అందమైన యుగళ గీతాన్ని ''రామోజీ ఫిలిం సిటీ'' లో జులై27 నించి 30 వరకు చిత్రీకరించారు.

''అరు బాబోరు...అరు బాబోరు.. దీని ఫ్రంటు చూస్తే అరు బాబోరు..దీని బ్యాక్‌ చూస్తే అరు బాబోరు'' అంటూ గీతరచయిత భాస్కర బట్ల వ్రాసిన యుగళ గీతాన్ని గోపీచంద్‌- త్రిషలపైన చిత్రీకరించారు. ఈ పాట చిత్రీకరణతో ''శంఖం'' చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఆగస్టు రెండో వారంలో ఆడియో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు జె.భగవాన్‌, జె. పుల్లారావులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ''అత్యంత భారీ ఎత్తున గోపీచంద్‌ హీరోగా మేము నిర్మిస్తున్న ''శంఖం'' చిత్రం చిట్ట చివరి పాటను రామోజి ఫిలిం సిటీలో చిత్రీకరించడం జరిగింది. దీనితో షూటింగ్‌ మొత్తం పూర్తి అయింది.

రామానాయూడు స్టూడియోస్‌లో ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 2వ వారంలో ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా మా ఆడియోని విడుదల చేస్తాము'' అన్నారు. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

గోపీచంద్‌ సరసన గ్లామర్‌ క్వీన్‌ త్రిష కథానాయికగా నటించింది. ఈ చిత్ర కథలోని ఓ కీలకమైన పాత్రను సత్యరాజ్‌ పోషిస్తున్నారు. చంద్రమోహన్‌, కోటశ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రమణ్యం, అలీ, వేణుమాధవ్‌, కృష్ణభగవాన్‌, యం. యస్‌.నారాయణ, ఎల్‌.బి.శ్రీరామ్‌, తదితరులు ఇతర పాత్రల్ని పోషించారు.

ఈ చిత్రానికి మాటలు- అనిల్‌ రావిపూడి, సంగీతం- తమన్‌, ఛాయగ్రహణం- వెట్రి, ఆర్ట్‌-వివేక్‌, ఎడిటింగ్‌- గౌతంరాజు, నిర్మాతలు- జె.భగవాన్‌, జె.పుల్లారావు ,కథ ,స్క్రీన్‌ప్లే ,దర్శకత్వం- శివ
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT