1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Entertainment

Cinema | Entertainment | Fear | Mantra | Devils | Comedy | Funny | త్వరలో " హాస్య " చిత్రం : వర్మ

సినిమా
FILE
సినిమా అనేది వినోదాన్ని పంచేది. మనిషి జీవితంలోని సంఘటనలను తెరపై వీక్షించే అవకాశాన్ని కల్పించింది సినిమా. ఇదే సినిమాని భయం, బీభత్సం, మంత్ర- తంత్రాలు, దెయ్యాలు- భూతాలు, థ్రిల్లర్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఇప్పుడు హాస్య చిత్రాన్ని నిర్మించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.

తాను తీసే తదుపరి చిత్రం హాస్య ప్రధాన సినిమా అని ఆయన ఢిల్లీలో వెల్లడించారు. తాను రూపొందించబోయే చిత్రం పూర్తిస్థాయి వినోదభరితంగా ఉంటుందని, దీనిపై ఇప్పటికే స్క్రిప్ట్ చర్చలు కొనసాగుతున్నట్లు వర్మ తెలిపారు.

వర్మ దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం అగ్యాత్‌ (హిందీ) (తెలుగులో అడవి) ప్రచారం కోసం ఢిల్లీ వచ్చిన వర్మ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. తాను కేవలం హారర్‌, ఫ్యాక్షన్‌ తరహా చిత్రాలే కాక అన్ని రకాల సినిమాలు చేయగలనని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
About Writer
Gulzar Ghouse