1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Cinema

Aa Aaa Ee Eee| Cinema| Preview| Meera Jasmine| Sada | త్వరలో తెరపైకి వస్తోన్న"అ.. ఆ.. ఇ.. ఈ.."

అ ఆ ఇ ఈ
శ్రీకాంత్, మీరాజాస్మిన్, సదా కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం "అ..ఆ.. ఇ.. ఈ.." (అతను ఆమె ఇంతలో ఈమె). శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో బొద్దం అశోక్‌యాదవ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. 

ప్రస్తుతం సెన్సార్ సిగ్నల్ కోసం వేచివున్న "అ..ఆ..ఇ..ఈ.."ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు.

కాబ్స్ డ్రైవర్ తన వైవాహిక జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకులను ఎలా పరిష్కరించుకున్నాడనే కథాంశంతో ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా చిత్రీకరించామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీరా జాస్మిన్, సదా పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన వెల్లడించారు.

కుటుంబంలో జరిగే చిన్నపాటి తగాదాలు, అనవసరమైన అపోహలతో ఎలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారో తెలియజెప్పే ఈ సినిమాలో చిన్నపాటి సందేశం కూడా ఇమిడి ఉందని దర్శకుడు అన్నారు.

శ్రీలేఖ సమకూర్చిన బాణీలు ఇప్పటికే శ్రోతల ఆదరణను చూరగొన్నాయని, సినిమా కూడా అదే తరహాలో ప్రేక్షకులను అలరిస్తుందని శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాత మాట్లాడుతూ.. రొటీన్‌గా వచ్చే ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఇది కాదని, యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని కొత్త పాయింట్‌తో తీసిన సినిమా ఇదని తెలిపారు.

ఆద్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే ఈ సినిమాలో నటీనటులు పాత్రలకు తగినట్లు అమరారని ఆయన అన్నారు. గిరిబాబు, భరణి, తెలంగాణ శకుంతల, కోవైసరళ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి. కుమార్.
About Writer
SELVI.M