APJ Abdul Kalam | Former President of India | bollywood | Mai Kalam Hoon | బాలీవుడ్ సినిమాలో మాజీ రాష్ట్రపతి...!
FILE
డాక్టర్ కలాం నుంచి ప్రేరణ పొందిన ఓ చిన్నారి తన కలలను ఎలా సాకారం చేసుకున్నాడనేది ఈ చిత్ర కథానేపథ్యం. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్‌తోపాటు ఫ్రాంస్‌కు చెందిన నటి సోఫీ బ్రౌస్‌టెల్‌లు నటించనున్నారు.
ఈ సినిమా ప్రీమియర్‌ను కాన్ చిత్రోత్సవంతోపాటు ప్రపంచ ఇతర చిత్రోత్సవాలలో ప్రదర్శించనున్నారు. సోఫీ ఇందులో ఓ పర్యాటకురాలిగా నటించనుంది. ఆమె తన జీవితంలో సంతోషం వెతుక్కునేందుకు భారతదేశ పర్యటనకు వస్తుంది. అప్పుడు గుల్షన్‌తో ఆమె ప్రేమలో పడుతుందని చిత్ర సమర్పకులు తెలిపారు.
