U & I | Audio | Rohan | Aditi | Supreme | ''యు అండ్ ఐ'' ఆడియో విడుదల
WD
యాస్కీ మాట్లాడుతూ, "నిర్మాత నాకు మంచి మిత్రుడు. యు.ఎస్.లో ఆయన కంపెనీకి లాయర్‌గా పనిచేశాను. అతను చేస్తున్న తొలి చిత్రం పాటలను చూశాను. ఈనాటి యూత్‌కు తగినట్లున్నాయి" అన్నారు.
చక్రి మాట్లాడుతూ, "ఈ పాటలను నేను అమెరికాలో ఉన్నప్పుడు రవీందర్‌గారు విన్పించారు. చాలా బాగున్నాయి. రవీందర్‌గారు మాకు దూరపు బంధువు కూడా. నా దగ్గరకు వస్తే సంగీతదర్శకుడిగా పెట్టుకుంటారనుకున్నా. అన్నీ మాట్లాడిన తర్వాత నిర్మాణ కార్యక్రమంలో నాకు సాయం చేయండి అని అడిగారు. సంగీతంకూడా వేరే అతన్ని పెట్టుకున్నాం అని అన్నారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు కార్తీక్ పాటలు విన్నాను. బావున్నాయి" అని చెప్పారు.
చిత్ర సంగీత దర్శకుడు కార్తీక్ మాట్లాడుతూ, దర్శకుడు రంజిత్‌కు నిర్మాత రవీందర్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. హీరో రోహన్ మాట్లాడుతూ, ఈ సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ అదితి మాట్లాడుతూ, తాను నటించిన తొలి సినిమానే ఇంత గ్రాండ్‌గా ఫంక్షన్ జరగడం ఆనందంగా ఉందనీ, అందరికీ మంచి పేరు తెస్తుందనే నమ్మకముందనీ అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ, సినిమా తీయాలనే కోరిక 1984 సంవత్సరం నుంచే ఉందనే విషయాన్ని, ఆ తర్వాత జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి చిత్రం స్వయంకృషి తనకు స్పూర్తిగా నిల్చిందనీ అందుకే పిహెచ్‌డి చేసిన తాను సినిమా తీయలేనా అని పట్టుదలతో చేయడానికి ఇంతకాలం పట్టిందన్నారు. అశ్లీలతకు తావులేకుండా చక్కని సినిమా తీయడమే తన లక్ష్యంగా చెప్పారు.
మరో అతిథి తరుణ్ మాట్లాడుతూ, రవీందర్ వంటి మంచి మనిషి సినిమాలు తీసి తద్వారా ఎంతోమందికి భృతి కల్పించాలని కోరారు. సోనీమ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
