Life Style,Nichal, Karthik, Ananya, Meenakshi Dekshith, Muppalaneni Siva | ఆగస్టు 15న తెరపైకి వస్తోన్న "లైఫ్స్టైల్"
WD
మంగళవారం రాత్రి సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శివ మాట్లాడుతూ, తాను గతంలో నిర్మించిన తాజ్‌మహల్, అమ్మాయికోసం వంటి చిత్రాల తరహాలో ఈ చిత్రముంటుందని చెప్పారు.
నిర్మాత కోగంటి రామకృష్ణ మాట్లాడుతూ, అన్నిటికంటే స్నేహం గొప్పదని తెలియజెప్పే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోందన్నారు. స్నేహంకోసం త్యాగాలు చేయడం, కొన్ని కష్టాలు అనుభవించడం, ఆపై గోల్‌ను సాధించడం వంటివి ఈ చిత్రంలో ఉంటాయని నిర్మాత వెల్లడించారు. యువతకు చక్కని సందేశంకూడా ఇందులో ఇమిడి ఉందని ఆయన తెలిపారు.
మొదటి భాగం కాలేజీ నేపథ్యంలోనూ, రెండవ భాగం కుటుంబకథా చిత్రంగా తీర్చిదిద్దినట్లు నిర్మాత అన్నారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్, సంగీతం: శ్రీజ.
