Drohi, Cinema, Preview, Sarath Kumar, Jyothika | 14న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ''ద్రోహి''
WD
ఈ చిత్రంలో శరత్‌కుమార్, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించారు. గతంలో శరత్‌కుమార్ నటించిన మండేసూర్యుడు, దండయాత్ర, మరో యుద్ధకాండ చిత్రాలు అఖండ విజయం సాధించాయి.
అలాగే సూపర్‌స్టార్ రజనీ నటించిన "చంద్రముఖి"లో కీలక పాత్ర పోషించిన జ్యోతిక "ద్రోహి" విభిన్నంగా కన్పిస్తుందని నిర్మాతలు వెల్లడించారు. యాక్షన్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు "ద్రోహి" చిత్రంలో అన్ని అంశాలూ ఉంటాయని వారు అన్నారు.
ఇకపోతే.. ఘర్షణ చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన దర్శకుడు గౌతమ్‌మీనన్ "ద్రోహి"కి దరకత్వ పగ్గాలు చేపట్టడం మరో విశేషం. హరీస్‌జైరాజ్ సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని నిర్మాతలు తెలియజేశారు.
భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాలు, అనురాగాలను ఈ చిత్రం ద్వారా దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారని నీరజ్ చెప్పారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఈ నెల 14న (శుక్రవారం) విడుదల చేయనున్నట్లు రమణ తెలిపారు.
