1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Shooting

Fruit Salad| Shooting| 7hills Entertainers| Shona neogi| Love Stories | తియ్యటి కథలతో తెరకెక్కనున్న "ఫ్రూట్‌సలాడ్"

ఫ్రూట్సలాడ్
WD
7హిల్స్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై ఇనగడప సతీష్‌కుమార్ నిర్మాతగా, సురేష్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ఫ్రూట్‌సలాడ్ (7 తియ్యటి ప్రేమకథలు) చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది.

త్వరలో తెరకెక్కేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.. ఈ చిత్రంలో షోనా నియోగి అనే నటిని పరిచయం చేస్తున్నామని తెలిపారు. ప్రేమికులందరూ ప్రేమలోని అన్ని కోణాలను చూడలేరు.

కొందరు తమ ప్రేమను గెలిపించుకుంటారు. కొందరు ఓడిపోతారు. మరికొందరు త్యాగం చేస్తారు. మరికొందరు జ్ఞాపకాల్లో ఉంచుకుంటారు. ఇదంతా ప్రేమే. అది జీవితాంతం మనసులో మెదలుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత వివరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రేమలేఖల పోటీ నిర్వహిస్తున్నామని, ఈ పోటీలో వయసుతో నిమిత్తంలేకుండా అందరూ పాల్గొనవచ్చునని తెలిపారు. ప్రేమకథల పోటీల్లో పాల్గొనేవారు 2-9-2009 తేదీలోపు.. 7హిల్స్ ఎంటర్‌టైనర్స్ బి-49, 3వ ఫ్లోర్, జర్నలిస్ట్ కాలనీ, హైదరాబాద్-33 అనే చిరునామాకు తమ కథలను పంపవచ్చునని నిర్మాత వెల్లడించారు.
About Writer
SELVI.M