1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Varun Sandesh

Kurradu| Varun Sandesh| Dasara, Neha Sharma| Happy Days| Kotha Bangaru Lokam | దసరాకు "కుర్రాడు"గా వస్తోన్న వరుణ్ సందేశ్

కుర్రాడు
WD
సూపర్‌హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్‌పై తమిళంలో నిర్మించి.. సూపర్‌హిట్ అయిన "పొల్లాదవన్" చిత్రాన్ని "హ్యాపీడేస్" ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. సందీప్ గుణ్ణం దర్శకత్వంలో రీమేక్ అవుతున్న ఈ చిత్రానికి "కుర్రాడు" అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

ఈ సినిమా గురించి నిర్మాత పి. కిరణ్ మాట్లాడుతూ.. హ్యాపీడేస్, కొత్తబంగారులోకం వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వరుణ్‌సందేశ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో నేహాశర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు గుణ్ణం గంగరాజు తనయుడు గుణ్ణం సందీప్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తెలియజేశారని నిర్మాత వెల్లడించారు.

ఈ కథకు "కుర్రాడు" అనే టైటిల్ వందశాతం సరిపోతుందని చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో భాగంగా.. రీ-రికార్డింగ్ జరుగుతోందని కిరణ్ చెప్పారు.

ఇంకా ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న అచ్చు పాటలను అద్భుతంగా చేశాడని నిర్మాత అన్నారు. సెప్టెంబర్ మొదటివారంలో ఆడియోను రిలీజ్ చేసి, దసరాకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.

"బొమ్మాళి" రవి, తనికెళ్ళ భరణి, అలీ, ఎం.ఎస్. నారాయణ, వేణు, నవీన్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, పాటలు: అనంతశ్రీరామ్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరక్టర్: ఆర్. రాంబాబు, ఫైట్స్: కీ.శే. రాంబో రాజ్‌కుమార్, దర్శకత్వం: సందీప్ గుణ్ణం, నిర్మాత: పి. కిరణ్.