1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
  4. Aarthi Agarwal

Neelaveni| Aarthi Agarwal| Posani| Mukul Dev| Aditya Om| Dasara | దసరాకు తెరపైకి వస్తానంటోన్న "నీలవేణి"

నీలవేణి
వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్తి అగర్వాల్, ముఖుల్‌దేవ్, పోసాని కృష్ణమురళి, ఆదిత్య ఓం ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, భరత్ పారేపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "నీలవేణి". 

ఎం.జి.ఆర్. కంబైన్స్ పతాకంపై పి. గిరీష్‌కుమార్ నిర్మిస్తున్న నీలవేణి నిర్విరామంగా షూటింగ్ జరుపుకుని ఒక ఫైట్ మినహా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.

ఫైట్‌మాస్టర్ రామ్-లక్ష్మణ్ వైవిధ్యంగా రూపొందించిన యాక్షన్ సన్నివేశాలతో పాటు క్లైమాక్స్, కోర్టు సన్నివేశాలను అత్యంత ఆసక్తికరంగా, రామోజీ ఫిలింసిటిలో పదిరోజుల పాటు చిత్రీకరించడం జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ.. పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ వున్న డిఫరెంట్ క్యారెక్టర్‌ని ఆర్తి అగర్వాల్ పోషిస్తున్నారని చెప్పారు. చక్కని హావభావాలను ప్రదర్శించి ఈ చిత్రంలోని "నీలవేణి" పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేశారని పారేపల్లి కితాబిచ్చారు.

ఇక యాక్షన్ సన్నివేశాల విషయానికొస్తే.. ఫైట్‌మాస్టర్ రామ్-లక్ష్మణ్ చాలా డిఫరెంట్‌గా సన్నివేశాన్ని కంపోజ్ చేశారని తెలిపారు. రామ్-లక్ష్మణ్ సహకారంతో పాటు లలిత్ సురేష్ అందించిన చక్కని బాణీలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు అన్నారు.

ఆడియో తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని, ఈ చిత్రనిర్మాణం ఇంత సాఫీగా జరగడానికి నటీనటులతో పాటు యూనిట్ అంతా తీవ్రంగా శ్రమించిందని దర్శకుడు చెప్పారు.

అలాగే నిర్మాత కూడా ఎక్కడా రాజీపడక అడిగినవన్నీ సమకూర్చారని దర్శకుడు తెలిపారు. సెప్టెంబర్ పదోతేదీన ఆడియోను రిలీజ్ చేసి, దసరా కానుకగా "నీలవేణి"ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.

యం.ఎస్. నారాయణ, గీతాసింగ్, శివపార్వతి, సుప్రీత్, రవికాలే, విజయ్ రంగరాజ్, సత్తెన్న, రవిప్రకాష్, వెంకట్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: ఆళ్ళ రామ్‌బాబు, పాటలు: రామకృష్ణ.
About Writer
SELVI.M